ఆంధ్రా గార్డెన్ లో కొత్తగా వేసిన పండ్ల మొక్కలు | Newly planted fruit plants in Andhra Garden
Andhra gardenలో కొత్తగా 25 రకాల పండ్ల మొక్కలు పెంచాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటివరకూ వివిధ నర్సరీల నుండి 11 రకాల పండ్ల మొక్కలు తెప్పించుకుని నాటడం జరిగింది. వాటిలో ప్రధానంగా చెరకు మామిడి, దానిమ్మ, జామ, యాపిల్ బేర్, సపోటా, స్వీట్ నిమ్మ, నారిజ, అంజీరా, సీతాఫలం, కమలం, నిమ్మ వంటి ఐబ్రీడ్ పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇవ్వన్నీ కూడా లోకల్ నర్సరీల నుండి సేకరించినవే.
Fruit plants |
వీటిని నాటేటప్పుడు భూమిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి అందులో ౩౦% మట్టి, 30% కోకోపీట్, 30% వర్మీ కంపోస్ట్, 10% పేప పిండి కలిపి మిశ్రమంగా తయారు చేసి రెండడుగుల గోతిలో పోసి పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇలా నాటడం వలన మొక్క తొందరగా మట్టిలో సర్డుకోవడమే కాకుండా బలంగా తయారవుతుంది.