Sunday, 26 January 2020

Andhra gardenకు స్వాగతం -సుస్వాగతం. | Welcome to Andhra garden

welcome-to-andhra-garden
Welcome to Andhra garden

Andhra gardenకు స్వాగతం -సుస్వాగతం.

హాయ్ ఫ్రెండ్స్... ఈ బ్లాగు ద్వారా మీకోసం Kichen gardening, Terrace gardening ఎలా పెంచాలి? గార్డెనింగ్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనం గార్డెనింగ్ పెంచడం వలన ఉపయోగాలు ఏమిటి? అనే ఇత్యాది విషయాలు నాకు తెలిసినంతవరకూ తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

మనం గార్డెనింగ్ ఎందుకు చేయాలి?

ఈరోజు మనం మార్కెట్ లో తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు అన్నీ విషతుల్యమైనవే. అవి అనేక రసాయన ఎరువులతో కలుషితమైనవే. వాటినే మనం ఆహారంగా తీసుకుంటూ జబ్బుల బారిన పడుతున్నాము. అనేక రోగాలతో సతమతమవుతూ బ్రతుకును ఈడుస్తున్నాము. పట్టుమని పదడుగుల దూరం నడిస్తే చాలు ఆయాసంతో ఊగిపోతున్నాము. మనలో ప్రతి ఒక్కరమూ డిగ్రీ సర్టిఫికెట్ల మాదిరి షుగర్,బిపిల రిపోర్టులను ఒంటికి తెచ్చుకుంటున్నాము. ఇవన్నీ మనకు రావడానికి ప్రధాన కారణం కలుషితమైన ఆహారం, కలుషితమైన నీళ్ళు, కలుషితమైన గాలి ఇవే. బయట ఎలాగూ పొల్యూషన్ తో నిండిపోయింది. అదే పొల్యూషన్ మన ఇంట్లో కూడా ఉంటే ఎలా? కలుషితమైన ఆహారాన్నే మనం తినాల్సినంత అవసరం దేనికి? ఒక్కసారి ఆలోచించండి?

Friday, 13 December 2019

ఆంధ్రా గార్డెన్ లో కొత్తగా వేసిన పండ్ల మొక్కలు | Newly planted fruit plants in Andhra Garden

ఆంధ్రా గార్డెన్ లో కొత్తగా వేసిన పండ్ల మొక్కలు | Newly planted fruit plants in Andhra Garden
Fruit plants
Andhra gardenలో కొత్తగా 25 రకాల పండ్ల మొక్కలు పెంచాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటివరకూ వివిధ నర్సరీల నుండి 11 రకాల పండ్ల మొక్కలు తెప్పించుకుని నాటడం జరిగింది. వాటిలో ప్రధానంగా చెరకు మామిడి, దానిమ్మ, జామ, యాపిల్ బేర్, సపోటా, స్వీట్ నిమ్మ, నారిజ, అంజీరా, సీతాఫలం, కమలం, నిమ్మ వంటి ఐబ్రీడ్ పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇవ్వన్నీ కూడా లోకల్ నర్సరీల నుండి సేకరించినవే.
వీటిని నాటేటప్పుడు భూమిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి అందులో ౩౦% మట్టి, 30% కోకోపీట్, 30% వర్మీ కంపోస్ట్, 10% పేప పిండి కలిపి మిశ్రమంగా తయారు చేసి రెండడుగుల గోతిలో పోసి పండ్ల మొక్కలను నాటడం జరిగింది. ఇలా నాటడం వలన మొక్క తొందరగా మట్టిలో సర్డుకోవడమే కాకుండా బలంగా తయారవుతుంది.

Monday, 22 July 2019