 |
Welcome to Andhra garden |
Andhra gardenకు స్వాగతం -సుస్వాగతం.
హాయ్ ఫ్రెండ్స్... ఈ బ్లాగు ద్వారా మీకోసం
Kichen gardening, Terrace gardening ఎలా పెంచాలి? గార్డెనింగ్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనం గార్డెనింగ్ పెంచడం వలన ఉపయోగాలు ఏమిటి? అనే ఇత్యాది విషయాలు నాకు తెలిసినంతవరకూ తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
మనం గార్డెనింగ్ ఎందుకు చేయాలి?
ఈరోజు మనం మార్కెట్ లో తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు అన్నీ విషతుల్యమైనవే. అవి అనేక రసాయన ఎరువులతో కలుషితమైనవే. వాటినే మనం ఆహారంగా తీసుకుంటూ జబ్బుల బారిన పడుతున్నాము. అనేక రోగాలతో సతమతమవుతూ బ్రతుకును ఈడుస్తున్నాము. పట్టుమని పదడుగుల దూరం నడిస్తే చాలు ఆయాసంతో ఊగిపోతున్నాము. మనలో ప్రతి ఒక్కరమూ డిగ్రీ సర్టిఫికెట్ల మాదిరి షుగర్,బిపిల రిపోర్టులను ఒంటికి తెచ్చుకుంటున్నాము. ఇవన్నీ మనకు రావడానికి ప్రధాన కారణం కలుషితమైన ఆహారం, కలుషితమైన నీళ్ళు, కలుషితమైన గాలి ఇవే. బయట ఎలాగూ పొల్యూషన్ తో నిండిపోయింది. అదే పొల్యూషన్ మన ఇంట్లో కూడా ఉంటే ఎలా? కలుషితమైన ఆహారాన్నే మనం తినాల్సినంత అవసరం దేనికి? ఒక్కసారి ఆలోచించండి?